వైఎస్ వివేకా హత్య కేసులో ఆదిని కూడా?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని విచారించిన పోలీసులు [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని విచారించిన పోలీసులు [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని విచారించిన పోలీసులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కూడా విచారించనుంది. బీటెక్ రవికి ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అలాగే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ని కూడా సిట్ విచారించే అవకాశాలున్నాయి. ఆదినారాయణరెడ్డి డ్రైవర్ దస్తగిరిని సిట్ ఇప్పటికే విచారించి వదిలేసినట్లు తెలిసింది. ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాకు రానున్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈలోగానే వివేకాహత్య కేసును ఒక కొలిక్కి తీసుకు రావాలని సిట్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. జగన్ కూడా ఈ హత్య కేసును ఇప్పటి వరకూ ఛేదించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.