Mon Dec 23 2024 15:26:06 GMT+0000 (Coordinated Universal Time)
Ys viveka : వివేకా హత్య కేసులో కీలక పరిణామం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఈ కేసులో అప్రూవర్ గా మారనున్నారు. ఈమేరకు సీబీఐ [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఈ కేసులో అప్రూవర్ గా మారనున్నారు. ఈమేరకు సీబీఐ [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఈ కేసులో అప్రూవర్ గా మారనున్నారు. ఈమేరకు సీబీఐ అధికారులు కడప సబ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కొన్ని నెలల పాటు విచారణ జరిపి నలుగురిని నిందితులుగా పేర్కొంది. సునీల్ కుమార్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి తో పాటు దస్తగిరిని కూడా నిందితుడిగా చేర్చింది. అయితే దస్తగిరిని సాక్షిగా తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సీబీఐ చెబుతుంది.
Next Story