మరో ఛానల్ ను బహిష్కరించిన వైసీపీ
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా వార్తలు ప్రసారం చేస్తూ, తమ వార్తలను వక్రీకరిస్తున్నారని ‘టీవీ5’ ఛానల్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తోంది. ఈ మేరకు శుక్రవారం [more]
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా వార్తలు ప్రసారం చేస్తూ, తమ వార్తలను వక్రీకరిస్తున్నారని ‘టీవీ5’ ఛానల్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తోంది. ఈ మేరకు శుక్రవారం [more]
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా వార్తలు ప్రసారం చేస్తూ, తమ వార్తలను వక్రీకరిస్తున్నారని ‘టీవీ5’ ఛానల్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీని భుజాన మోసే స్థితి నుంచి నెత్తికించుకుని వార్తలు ప్రసారాలు చేస్తున్న టీవీ5 నిషేధిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఇక నుంచి టీవీ5 చర్చలకు వైసీపీ తరపున ఎవరూ పాల్గొనరాదని, తమ నేతలను చర్చలకు కూడా పిలవవద్దని స్పష్టం చేసింది. పార్టీ ప్రెస్ మీట్లు, కవరేజీకి కూడా టీవీ5ను నిషేధించింది. స్వతంత్ర జర్నలిజం ముసుగులో ఎల్లో మీడియాగా మారిన వారిని బట్టబయలు చేసేందుకే వైసీపీ ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ప్రకటించింది. ఇంతకు ముందే వైసీపీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ను బహిష్కరించిన విషయం తెలిసిందే.