వైసీపీ కొత్త తరహా ప్రచారం.. సక్సెస్ అయ్యేనా..?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ పెరుగుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు నిత్యం ఏవో కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ పెరుగుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు నిత్యం ఏవో కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ పెరుగుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు నిత్యం ఏవో కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు జన్మభూమి కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రావాలి జగన్ – కావాలి జగన్ పేరుతో అన్ని గ్రామాలు చుట్టేస్తున్నారు. ఇక, జగన్ పాదయాత్ర ఈ నెల 9న ముగియనుండటంతో అప్పటివరకు అన్ని నియోజకవర్గాల్లో రోజుకు రెండు గ్రామాల్లో సభలు వైసీపీ నేతలు సభలు నిర్వహిస్తున్నారు. ఇక, వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్న వైసీపీ చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొత్త తరహా ప్రచారాన్ని ప్రారంభించింది.
నిన్ను నమ్మం బాబు… అంటూ
‘నిన్ను నమ్మం బాబు’ అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకుంది. సోషల్ మీడియాతో పాటు బయట కూడా ఈ నినాదాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు. వాహనాలకు ఈ నినాదంతో కూడిన స్టిక్కర్లను అంటిస్తున్నారు. ఇటువంటి నినాదాలు గత ఎన్నికల్లో టీడీపీ విజయానికి బాగానే దోహదపడ్డాయి. ‘బ్రింగ్ బాక్ బాబు’, ‘జాబు కావాలంటే బాబు రావాలి’, ‘ఆయన రావాలి – ఆయనే రావాలి’ అంటూ చేసిన ప్రచారం బాగానే ప్రజల్లోకి వెళ్లి టీడీపీకి విజయాన్ని కట్టబెట్టింది. మరి, వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.