జంతర్ మంతర్ లో జగన్ పార్టీ…??
చంద్రబాబునాయుడు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అబద్ధాలతో ముందుకు వస్తున్నారని, ప్రజలు వాటిని విశ్వసించవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని జంతర్ మంతర్ [more]
చంద్రబాబునాయుడు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అబద్ధాలతో ముందుకు వస్తున్నారని, ప్రజలు వాటిని విశ్వసించవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని జంతర్ మంతర్ [more]
చంద్రబాబునాయుడు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అబద్ధాలతో ముందుకు వస్తున్నారని, ప్రజలు వాటిని విశ్వసించవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వంచనపై గర్జన దీక్షను వైసీపీ నేతలు ప్రారంభించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కు చేస్తున్న అన్యాయాలపై వారు నినదించారు. కేవలం తన స్వార్థం కోసమే నాలుగున్నరేళ్లు ప్రత్యేక హోదాను పక్కన పెట్టి, ఎన్నికల సమయానికి దాన్ని భుజానకెత్తుకున్నారని చంద్రబాబుపై వైసీపీనేతలు నిప్పులు చెరిగారు. నాలుగున్నరేళ్లుగా హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తుంది జగన్ ఒక్కరే నని అన్నారు.
అన్నీ దొంగ పనులే…..
చంద్రబాబు దొంగ శంకుస్థాపనలు, పునాదిరాళ్లకు ప్రజలు లొంగరని అన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీని విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సి ఉన్నా… ఎన్నికల కోసమే చంద్రబాబు శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. ఈ విషయం అందరికీ తెలుసునన్నారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు విభజన హామీలను వేటినీ పరిష్కరించుకోలేకపోయారన్నారు. తన స్వార్థం కోసమే ఢిల్లీ చుట్టూ 29 సార్లు తిరిగారన్నారు. తమ పార్టీ ఎంపీలు హోదా కోసం పదవులకూ రాజీనామా చేసిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకూ దీక్ష కొనసాగనుంది.
- Tags
- delhi
- jantharmanthar
- nara chandrababu naidu
- telugudesam party
- vanchana pai garjana
- y.s jaganmohanreddy
- ysr conggress party
- à°à°à°¤à°°à± à°®à°à°¤à°°à±
- ఢిలà±à°²à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- à°µà°à°à°¨à°ªà± à°à°°à±à°à°¨
- à°µà±à°à°¸à± à°à°à°¨à±à°®à±à°¹à°¨à± à°°à±à°¡à±à°¡à°¿
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±