Fri Nov 22 2024 01:59:48 GMT+0000 (Coordinated Universal Time)
వల్లభనేని పై తిరుగుబాటు.. ఇన్ ఛార్జి పదవి ఇవ్వవద్దంటూ?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వైసీపీ క్యాడర్ తిరుగుబాటును ప్రకటించింది. ఈ మేరకు విజయసాయిరెడ్డికి లేఖ రాసింది.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వైసీపీ క్యాడర్ తిరుగుబాటును ప్రకటించింది. ఈ మేరకు విజయసాయిరెడ్డికి లేఖ రాసింది. గన్నవరం వైసీపీ క్యాడర్ పేరిట విజయసాయిరెడ్డికి అందిన లేఖ పార్టీలో సంచలనంగా మారింది. గన్నవరం నియోజకవర్గం ఇన్ ఛార్జి బాధ్యతలను వల్లభనేని వంశీకి ఇవ్వవద్దంటూ లేఖలో పేర్కొన్నారు. తాము తొమ్మిదేళ్ల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గన్నవరంలో పార్టీని కాపాడుకుంటూ వస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు.
వంశీకి తప్ప....
అయితే వల్లభనేని వంశీ తన కేసుల కోసం వైసీపీకి మద్దతుదారుగా మారారని లేఖలో కొందరు పేర్కొన్నారు. వల్లభనేని వంశీకి తప్ప ఎవరికి టిక్కెట్ కేటాయించినా వచ్చే ఎన్నికల్లో ముప్ఫయి వేల మెజారిటీతో విజయం సాధిస్తామని ఆ లేఖలో గన్నవరం వైసీపీ క్యాడర్, జగనన్న అభిమానుల పేరిట పేర్కొన్నారు. నియోజకవర్గంలో తక్షణం కొత్త ఇన్ చార్జిని నియమించాలని వారు లేఖలో పేర్కొన్నారు.
టీడీపీ నుంచి గెలిచి...
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ తర్వాత వైసీపీకి మద్దతుదారుగా మారారు. గన్నవరంలో అప్పటికే ఉన్న వైసీపీ నేతలు వంశీ చేరికను వ్యతిరేకించినా జగన్ ఓకే చెప్పారు. అప్పటి నుంచి గన్నవరంలో రెండు గ్రూపులు తయారయ్యాయి. అయితే ఎటువంటి పేరు పెట్టిన ఈ లేఖను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ అధినాయకత్వం చెబుతుంది. కానీ గన్నవరం నియోజవకర్గానికి విజయసాయిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ ఛార్జి. ఆయనకే ఈలేఖ ఎందుకు రాశారన్నది చర్చనీయాంశంగా మారింది.
Next Story