Mon Dec 23 2024 08:47:03 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మేకపాటి విజయం.. భారీ మెజారిటీ
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ విజయం సాధించారు. 82,888 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ విజయం సాధించారు. 82,888 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 20 రౌండ్లు పూర్తయ్యే సరికి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,742 ఓట్లు వచ్చాయి. పోస్టల్ ఓట్లు 146 తో కలిపి 82,888 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కు 20 వేలు ఓట్లు కూడా పోల్ కాలేదు. భరత్ కుమార్ యాదవ్ కు 19,316 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉప ఎన్నిక మొత్తం ఏకపక్షంగా జరిగిందనే చెప్పాలి.
బీజేపీకి మాత్రం...
మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికకు టీడీపీ, జనసేన దూరంగా ఉన్నాయి. బీజేపీ మాత్రం వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమంటూ పోటీకి నిలపడంతో ఎన్నిక అనివార్యమయింది. మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చివరకు మేకపాటి విక్రమ్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.
Next Story