అర్థరాత్రి బాబును ఎందుకు కలిశారు..?
ముఖ్యమంత్రి చంద్రబాబును అర్థరాత్రి ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలవాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. మంగళవారం [more]
ముఖ్యమంత్రి చంద్రబాబును అర్థరాత్రి ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలవాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. మంగళవారం [more]
ముఖ్యమంత్రి చంద్రబాబును అర్థరాత్రి ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలవాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… సర్వేల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను గందరగోళ పరిచేందుకు వీరు ముగ్గురూ కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సర్వేల పేరుతో వైసీపీని దెబ్బతీయాలని కుట్రపన్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి సర్వే ఏమైందో అందరికీ తెలిసిందేనన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సర్వేల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ సమావేశానికి తమకు ఆహ్వానం అందిందని, అయితే, రాష్ట్రాన్ని మోసం చేసిన టీడీపీ, జనసేన మధ్య కూర్చోలేమని, అందుకే హాజరుకాలేదన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అంటారని… ఎన్నికల తర్వాత ప్యాకేజీ కావాలంటారన్నారు. హోదా అంటే జైల్లో పెట్టించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతోంది వైసీపీ మాత్రమేనన్నారు.