ఆ కలెక్టర్ ఉంటే ఇక అంతే… వైసీపీ
చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవగా ఇవాళ [more]
చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవగా ఇవాళ [more]
చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవగా ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. చంద్రగిరిలో రీపోలింగ్ సమయంలో, కౌంటింగ్ సమయంలో తెలుగుదేశం పార్టీ అలజడులు సృష్టించే అవకాశం ఉందని వైసీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. రీపోలింగ్ తో పాటు కౌంటింగ్ కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అరాచకాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు వైసీపీ నేతలు తెలిపారు. తన పేషీలో పనిచేసే అధికారితో చంద్రబాబు అక్రమాలు చేయించారని ఆరోపించారు. ఏకపక్షంగా వ్యవహరించిన కలెక్టర్ ప్రద్యుమ్నను విధుల నుంచి తప్పించాలని కోరారు. రాప్తాడు రిటర్నింగ్ అధికారిపై సైతం చర్యలు తీసుకోవాలని కోరారు.