Thu Dec 19 2024 16:40:13 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : షాకింగ్ డెసిషన్.. పోటీ చేయకూడదని నిర్ణయం.. కాంగ్రెస్ కు మద్దతు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు.
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ కు మద్దతివ్వాలని ఆమె నిర్ణయించారు. మీడియాతో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని వైఎస్ షర్మిల తెలిపారు. గెలుపు గొప్పదే కాని, త్యాగం అంతకంటే గొప్పదని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా వైఎస్సార్టీపీ మద్దతిస్తుందని, కేసీఆర్ నియంత పాలన అంతమొందించాలని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు.
కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు...
తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పాలేరులో తాను పోటీ చేయాలనుకున్నప్పటికీ అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారని, అందుకోసమే తాను తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 35 ఏళ్లు సేవ చేశారని, అందుకే తన తండ్రి ఉన్న పార్టీకే మద్దతిచ్చానని తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం కోసం వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు పనిచేయాలని ఆమె పిలుపు నిచ్చారు.
Next Story