Mon Dec 02 2024 11:40:09 GMT+0000 (Coordinated Universal Time)
ఈసారి వైవీ పోటీ .... మాగుంట ప్లేస్ కూడా డిసైడ్ అయింది
ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి 2024 లో జరిగే ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్న సంకేతాలను పంపుతున్నారు.
వైవీ సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అందుకు ఆయన ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి 2024 లో జరిగే ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్న సంకేతాలను పంపుతున్నారు. ఆయన ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది.
మరోసారి టీటీడీకి...
జగన్ కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు వైవీ వర్గీయులు చెబుతున్నారు. ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా ఉన్నారు. ఆయనకు రెండోసారి టీటీడీ ఛైర్మన్ పదవిని జగన్ ఇచ్చారు. అంటే 2023 చివర వరకూ టీటీడీ ఛైర్మన్ గా సుబ్బారెడ్డి కొనసాగుతారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండటంతో ఆయనకు ఈసారి మళ్లీ టీటీడీ పదవి తీసుకునే ఛాన్స్ లేదు. ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి పరిస్థితి ఏంటన్న చర్చ కూడా జరగుతుంది.
ఆయన కుమారుడు....
అయితే ఒంగోలు పార్లమెంటు కు వైవీ సుబ్బారెడ్డి పోటీ చేస్తే, మాగుంట కుటుంబానికి శాసనసభలో అవకాశమివ్వాలని నిర్ణయించారని తెలిసింది. మాగుంట శ్రీనివాసరెడ్డి తన కుమారుడు రాఘవరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలే సరైన సమయం అని ఆయన భావిస్తున్నారు. అయితే రాఘవరెడ్డిని గిద్దలూరు లేదా కనిగిరి నుంచి పోటీ చేయించాలన్నది మాగుంట శ్రీనివాసరెడ్డి ఆలోచన.
గిద్దలూరు లేదా కనిగిరి....
ఈ రెండు నియోజకవర్గాల్లో మాగుంట కుటుంబానికి మంచి పట్టుంది. వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా వైసీపీకి కూడా ఈరెండు నియోజకవర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉంది. అందుకే ఈ రెండు నియోజకవర్గాలలో ఏదో ఒక దాని నుంచి పోటీ చేయాలని మాగుంట రాఘవరెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైవీ సుబ్బారెడ్డి 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి కనిగిరి, గిద్దలూరు లో ప్రస్తుతమున్న ఎమ్మెల్యే లపరిస్థితి ఏంటన్నది జగన్ తేల్చాల్సి ఉంటుంది.
Next Story