Mon Dec 23 2024 09:06:58 GMT+0000 (Coordinated Universal Time)
ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కాబోను
ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరం కాబోనని టీటీడీ ఛైర్మన్ గా రెండోసారి నియమితులైన వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాను దూరం కావడం లేదని [more]
ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరం కాబోనని టీటీడీ ఛైర్మన్ గా రెండోసారి నియమితులైన వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాను దూరం కావడం లేదని [more]
ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరం కాబోనని టీటీడీ ఛైర్మన్ గా రెండోసారి నియమితులైన వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాను దూరం కావడం లేదని ఆయన చెప్పారు. అయితే టీటీడీ ఛైర్మన్ గా రెండోసారి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ కు వైవీ సుబ్బారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. స్వామి వారికి సేవ చేసే భాగ్యం మరోసారి దక్కినందుకు సంతోష పడుతున్నానని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు తాను పాటుపడతానని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Next Story