అమ్మకు మళ్లీ అంత్యక్రియలు
తమిళనాడు రాష్ట్రాన్ని అనాధ గా వదిలేస్తూ, తమిళ ప్రజలను శోక సముద్రంలో ముంచేస్తూ తమిళ ప్రజలు ఆప్యాయంగా అమ్మ అని పిలుచుకునే మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ప్రభుత్వ లాంఛనాల మధ్య జయలలిత అంత్యక్రియలు శశికళ నేతృత్వంలోని ఏ.ఐ.డి.ఎం.కే సభ్యులు మదర్సా మెరీనా బీచ్ లో ఎం.జి.ఆర్ సమాధి చెంతనే నిర్వహించిన. సంగతి విదితమే. కాగా, ఈ అంత్యక్రియలు జయలలిత కుటుంబ సభ్యులకు సంబంధం లేకుండా, ఆప్తుల ప్రమేయం లేకుండా సాంప్రదాయ విరుద్ధంగా జరిగాయి అని జయలలిత కుటుంబ సభ్యులు (దాయాదుల సంతానం) శశికళ పై తీవ్ర ఆరోపణలు చేశారు. వీటికి శశికళ స్పందించక పోవటంతో జయలలిత కుటుంబ సభ్యులు జయలలిత రూపంలో వుండే బొమ్మను చేపించి అంత్యక్రియలు సాంప్రదాయ బద్దంగా జరిపారు.
తమిళ బ్రాహ్మణ (ఐయంగార్) కుటుంబంలో జన్మించిన జయలలిత నాస్తికురాలు కారు అని, ఒకవేళ ఆవిడ నాస్తికురాలు అయితే ఆవిడ అనేకమార్లు దేవాలయాలకు ఎందుకు వెళ్తారు అని శశికళ బృందాన్ని ప్రశ్నిస్తున్నారు జయలలితకు సోదరుడి వరుస అయ్యే వరదరాజు. ఆయనే జయలలితకు సాంప్రదాయం ప్రకారం మళ్లీ అంత్యక్రియలు జరిపారు. దానితోపాటు జయలలిత ఆత్మ శాంతి చేకూరటానికి మరో ఐదు రోజుల పాటు అంత్యక్రియల అనంతరం ఐయంగార్ ల పద్దతిలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు.
జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోజుల్లో తనను శశికళ లోపలి వెళ్ళటానికి అనుమతించలేదు అని జయలలిత మేనకోడలు దీప ఆరోపించిన తరువాత ఇప్పుడు కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా అమ్మ అంత్యక్రియలలో అతి చనువు చూపారు అని శశికళ పై వస్తున్న ఆరోపణలకైనా స్పందిస్తుందో లేదో మరి.
- Tags
- jayalalitha