ఆ అధికారిణి అవినీతి తిమింగలమే
లెక్కల్లోలేని 50 కోట్ల నల్లధనం కలిగి ఉన్న అవినీతి తిమింగలం లాంటి ఓ అధికారిణిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కర్నూలు జిల్లాలో డీఎం అండ్ హెచ్ఓ గా పనిచేస్తున్న స్వరాజ్య లక్ష్మి ఇళ్ల మీద దాడులు నిర్వహించినప్పుడు.. ఏసీబీ అధికారులు నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. తమకు అందిన సమాచారాన్ని బట్టి.. ఏసీబీ అధికారులు ఏకకాలంలో కర్నూలులోని ఆమె ఇంటితోపాటు విజయనగరం, విశాఖపట్టణంలలో కూడా దాడులు నిర్వహించారు. విశాఖ మర్రిపాలెంలో ఆమెకు చెందిన ఒక ఇంటిని ఏకంగా సీజ్ చేశారు.
బయటపడిన మొత్తం మాత్రమే కాదు. విశాఖపట్టణంలో ఆమెకు ఇంకా బోలెడన్ని బ్యాంకు లాకర్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆమెను విశాఖ రావాల్సిందిగా సమన్లు పంపారు. గతంలో విశాఖలో కూడా పనిచేసిన స్వరాజ్య లక్ష్మి చాలా పెద్దఎత్తున అవినీతి సొమ్ము, బంగారం పోగేసినట్లు తెలుస్తోంది. ఆమె విశాఖ కు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో విచారిస్తే గానీ. అసలు సంగతి తేలదని అధికార్లు అంటున్నారు.
విశాఖ తరువాత విజయనగరంలో కూడా పనిచేసిన స్వరాజ్య లక్ష్మి... ఇన్ఛార్జి రీజినల్ డైరక్టర్ గా కూడా చేశారు. ఆసమయంలో ఆమె మీద అనేక ఆరోపణలు వచ్చాయి. నర్సుల నియామకంలో అక్రమాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. తీరా కర్నూలు వచ్చిన తర్వాత ఆమె ఏసీబీకి చిక్కారు.
- Tags
- corruption