ఇక ఆపరేషన్ కాకినాడ
నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ముగుస్తుండటంతో కాకినాడ మున్సిపాలిటీపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. కాకినాడ మున్సిపాలిటీని దక్కించుకోవాలని టీడీపీ - వైసీపీలు బలంగా భావిస్తుండటంతో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత జరుగుతున్న కాకినాడ మునిసిపాలిటీని ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని టీడీపీ భావిస్తోంది. తూర్పుల్లో టీడీపీకి బలమైన పట్టు ఉన్నా మునిసిపల్ ఎన్నికలు మాత్రం నల్లేరు మీద నడక కాదని ఆ పార్టీకి అర్ధమైంది.గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కాకినాడలో ప్రచారం నిర్వహించనున్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు., నిమ్మకాయల చినరాజప్ప., ప్రత్తిపాటి పుల్లారావు, కళా వెంకట్రావులు ఇప్పటికే కాకినాడలో మకాం వేసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా కాకినాడను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వినాయక చవితి తర్వాత జగన్ కాకినాడలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఆ పార్టీ కీలక నేతలు కాకినాడలో మకాం వేసి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఓ మునిసిపాలిటీ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నిక రసవత్తరంగా మారనుంది.
- Tags
- కాకినాడ