ఇన్వర్టర్లు పోయాయి...ఇన్వెస్టర్లు వచ్చారు...
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అంధకారంలో నుంచి వెలుగులోకి పయనిస్తుందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో విద్యుత్తు అంశంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఇన్వర్టర్ల కాలం పోయి ఇన్వెస్టర్ల కాలం వచ్చిందన్నారు. తెలంగాణ ఆవిర్భవించే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్తు లోటుతో ఉన్నట్లు కేసీఆర్ గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో విద్యుత్తు అందక పంటలన్నీ నష్టపోయామని ఆవేదన చెందారు. తర్వాత జెన్ కో విద్యుత్తు సామర్ధ్యాన్ని పెంచుకుని ఇప్పడు విద్యుత్తు కొరత అనేది లేకుండా చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు.
మిగులే లక్ష్యంగా....
2019నాటికి తెలంగాణలో విద్యుత్తు మిగులు ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు. 27,187 మెగా వాట్ల విద్యుత్పుత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉదయ్ పథకంలో రాష్ట్రాన్ని చేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ సభకు గుర్తు చేశారు. ఈ పధకంతో డిస్కంలు అప్పుల నుంచి బయటపడతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
- Tags
- కేసీార్