ఏపీలో ఇక వీరు కూడా డాక్టర్లే...ఇదేం చోద్యం?
రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్., ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్లకు చట్టబద్దత కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై వైద్యులు మండిపడుతున్నారు. ఆర్ఎంపీ., పిఎంపీలకు తగిన పరీక్షలు నిర్వహించి వారు చేసే వైద్యానికి చట్టబద్దత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే న్యాయస్థానంలో సవాలు చేస్తామని హెచ్చరించారు. వైద్య విద్యపై పరిజ్ఞానం లేని వారిని ప్రజల ప్రాణాలతో చలగాటమాడేలా వదలడం మంచిది కాదని ఐఎంఏ మాజీ జాతీయ అధ్యక్షుడు సమరం అన్నారు. ప్రభుత్వ నిర్ణయం బాధాకరమన్నారు. సరైన విద్యార్హతలు., వైద్య పరిజ్ఞానం లేని వారిని వైద్యులుగా గుర్తించడం సరికాదన్నారు. భా
వైద్యులను నియమించండి గాని....
రతీయ వైద్య సంఘం ఇప్పటికే ఈ విధానాలను తప్పని ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే భావన ప్రభుత్వానికి ఉంటే మండలానికో ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించి అందులో ప్రజల అవసరాలకు సరిపడేలా వైద్యులను నియమించాలన్నారు. ఆర్ఎంపి., పిఎంపిలకు శిక్షణ ఇచ్చి పారామెడికల్ సిబ్బందిగా గుర్తించాలన్నారు. ప్రతి గ్రామంలో ఆశావర్కర్లు., ఏఎన్ఎంలకు పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలని దానికి వైద్యులు కూడా సహకరిస్తారని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం 13వేల మంది వైద్యుల్ని కించపరచడమేనని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.