కాకినాడ కాజా ఎవరు తింటారు ...?
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు నంద్యాల ఉపఎన్నికల స్థాయికి ఏ మాత్రం తీసిపోవడం లేదు. ఇక్కడ లంగరు వేసింది టిడిపి భారీ ప్రణాళికతో . వైసిపి శ్రేణులు అదే స్థాయిలో మోహరించి ఓటర్లు చుట్టూ ప్రదక్షిణాలు కొట్టాయి . నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అఖండ మెజారిటీతో గెలిచిన పరిస్థితుల్లో ఇక్కడి ఓటర్లు అలాగే స్పందిస్తారా లేక భిన్నంగా వ్యవహరిస్తారా అని తెలుగు వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .దుమ్మురేగేలా అన్నిపక్షాలు సాగించిన ప్రచారం పూర్తి అయ్యి పోలింగ్ కి చేరుకున్న కాకినాడ ఎన్నికలు తీరు విభిన్నంగా సాగనున్నాయి . కారణం స్థానిక ఎన్నికలు కావడం .
టికెట్ ఎంపిక , ఎన్నికల మేనేజ్మెంట్ కీలకం .....
కాకినాడలో జరిగేది స్థానిక సంస్థ ఎన్నిక . అనేక స్థానిక అంశాలతో ఇక్కడి విజయం ముడిపడి ఉంటుంది . దేశానికి ప్రధాని కావడం సులువు కానీ క్రింది స్థాయిలో వార్డ్ సభ్యడుగా గెలవడం కష్టం అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నానుడి . ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి వుండే కార్పొరేటర్ గెలుపు ఏ పార్టీ వారికైనా అంత సులువు కాదు . పార్లమెంట్ అభ్యర్థి కి పార్టీ గాలి 75 శాతం, అసెంబ్లీ అభ్యర్ధికి 50 శాతం , స్థానిక సంస్థల అభ్యర్ధికి 25 శాతం పార్టీ పని చేస్తుందన్నది సీనియర్ రాజకీయ నాయకుల విశ్లేషణ . అందువల్ల నంద్యాల తో కాకినాడ ఎన్నికలు పోల్చకూడదని అంటున్నారు చాలా మంది .
- Tags
- కాకినాడ