Fri Dec 27 2024 19:14:32 GMT+0000 (Coordinated Universal Time)
కాకినాడలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల బాహాబాహీ
కాకినాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9, 14వ వార్డులో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. 14వ వార్డులో వైసీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. టీడీపీ, బీజేపీ డబ్బులు పంచుతున్నారని వైసీపీ నేతలు అభ్యంతరం చెప్పడంతో ఈ ఘర్షణ తలెత్తింది. అయితే పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాకినాడలో ప్రారంభమైన పోలింగ్ ప్రస్తుతం ప్రశాంతంగానే జరుగుతుంది. 48 వార్డుల్లో జరుగుతున్న ఈ ఎన్నికను రెండు పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే నోటా లేదని కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండదని అధికారులు చెబుతున్నారు.
Next Story