కృష్ణ, మహేష్ కుటుంబానికి ఇరకాటం ...?
ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు . ఆయన వైఎస్సాఆర్ పార్టీలో ఉండటం ప్రచారం చేయడం వరకు బానే వుంది . కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సూపర్ స్టార్ కృష్ణ , ప్రిన్స్ మహేష్ బాబుల అభిమానులు , సంఘాలు వైసిపి విజయానికి పని చేయాలంటూ పిలుపు నివ్వడం కొత్త వివాదాలకు తెరతీసింది . మహేష్ బాబు బావ ఎంపీ గల్లా జయదేవ్ ఈ స్టేట్ మెంట్ తో ఉలిక్కి పడ్డారు . తెలుగుదేశం పార్టీలో వున్న జయదేవ్ కి ఆదిశేషగిరి రావు వ్యాఖ్యలు కలవరపాటుకు గురిచేయడంతో పాటు టిడిపి నుంచి వత్తిడి మొదలైంది . దాంతో ఆయన మీడియా సమావేశం పెట్టుకుని ఆదిశేషగిరి వ్యాఖ్యలు ఖండించుకోవాలిసి వచ్చింది . వారిద్దరూ టిడిపి కే మద్దతు అని అభిమానులు వైసిపి తరపు చేయకండి తెలుగుదేశాన్ని గెలిపించాలనే ప్రకటనే చేశారు .
మౌనంగా హీరోలు .....
ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు అసలు హీరోలు కృష్ణ, మహేష్ బాబులు మౌనంగానే వున్నారు . వారి సమ్మతితో ఆదిశేషగిరిరావు పిలుపునిచ్చారో లేదో చెప్పలేదు . అలాగే తన బావ మాటలే నిజమని తాము టిడిపి తోనే ఉన్నామని కానీ మహేష్ ప్రకటన చేయక పోవడం విశేషం . మరో వైపు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు తో బాగా కనెక్ట్ అయ్యి వుండే కృష్ణ , మహేష్ అభిమాన సంఘాలు మాత్రం వైసిపి విజయానికి కాకినాడలో డోర్ టూ డోర్ తిరగడం మరో కొసమెరుపు.