గుడ్ల గూబతో ఇంటి మొత్తాన్ని దోచేస్తారు
దొంగలు రెండు రకాలు.. కష్టాన్ని నమ్ముకున్న దొంగలు.. తమ తెలివిని నమ్ముకున్న దొంగలు. ఇప్పుడు అందులో రెండో రకం బ్యాచ్ దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక మూల హల్ చల్ చేస్తూనే ఉంది. తాజాగా బెంగళూరులోని దొంగలు బాగా తెలివి మీరారు. ఇప్పటివరకూ ఇలాంటి దొంగతనాలను మీరు అసలు విని కూడా ఉండరు. అందుకే ఈ విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ నయా స్టయిల్ దొంగలు ముందుగా గుడ్ల గూబలను ఇంట్లోకి వదులుతారు. అప్పుడు భయంలో ఉన్న కుటుంబ సభ్యులకు ఈ దొంగల బ్యాచ్ సభ్యులు కంటపడతారు. మీ ఇంట్లోకి గుడ్ల గూబ ప్రవేశించింది. ఇకపై మీ ఇంట్లో..మీ జీవితంలో ప్రశాంతత అనేది ఉండదు. ఒకవేళ మేము చెప్పినట్లు చేయలేదో మీరు సర్వ నాశనం అయిపోతారు అంటూ వారిని భయపెడతారు. మీ ఇంట్లో శుభం జరగాలంటే మేము చెప్పిన గుడికి మీరు వెళ్ళి రావాలి అని అంటారు.
గుడ్లగూబతో సహా ఐదుగురి అరెస్ట్.....
ఇక అంతే ఆధ్యాత్మికత ఉన్న కుటుంబ సభ్యులు పెట్టే బేడా సర్దుకుని పరిహారం కోసం గుళ్లకు బయలుదేరుతారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది..రాత్రికి దొంగల్లాగా వచ్చి ఆ ఇంట్లో ఉన్న వస్తువులను అన్నిటినీ దోచేస్తారు. అలా దొంగతనాలు చేస్తున్న ఈ బ్యాచ్ లోని ఐదుగురు ముఠా సభ్యులను బెంగళూరు లోని కాటన్ పేట పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.అంతేకాదండోయ్.. వారి ముఠాలో కీలకమైన ఓ గుడ్ల గూబను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గుడ్ల గూబను ఇంట్లోకి వదిలిన బ్యాచ్.. ఆ తర్వాత దోషం పోవాలంటే గుళ్ళను సందర్శించాలని చెబుతారు. వారి మాయమాటలు నమ్మి ప్రయాణం కట్టిన ఎన్నో ఇళ్లను సర్వం దోచేసింది ఈ బ్యాచ్. వరుసగా ఈ తరహా కంప్లయింట్లు రావడంతో అక్కడి పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు.
- Tags
- గుడ్లగూబ