టన్నుల కొద్దీ బంగారం ఎక్కడి నుంచి వస్తుంది?
బంగారం ఎప్పుడూ మహిళలకు ఇష్టమే. నార్త్ ఇండియా కంటే కూడా సౌత్ ఇండియాలోని మహిళలకు ఈ బంగారం అంటే మరీ ఇష్టం.. బంగారం అమ్మకాలు సౌత్ ఇండియాలోనే ఎక్కువగా కొనసాగుతుంటాయి. గ్రాము బంగారం రూపాయి తక్కువ ధరకు వస్తుందంటే చాలు క్యూలు కడతారు మన మహిళలు. అయితే ఇతరు దేశాల నుంచి వచ్చే బంగారం అంటే చాలు .. ఈ గోల్డ్ కోసం మహిళలు ఎగ బడుతుంటారు. బంగారం వీక్ నెస్ ను తీసుకుని గోల్డ్ మాఫియా రెచ్చి పొతుంది. కొత్త కొత్త పద్దతుల్లో బంగారం మన శంషాబాద్ ఎయిర్ పొర్టుకు వస్తున్న తీరు పై తెలుగు పోస్ట్ ప్రత్యేక కథనం.
హైదరాబాద్ అడ్డాగా మారిందా?
గోల్డ్ మాఫియాకు హైదరాబాద్ ఒక అడ్డాగా మారిపోయింది .. ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఈ గోల్డ్ మాఫియా రెచ్చిపోతుంది.ఎక్కడో ఫ్యాన్ వేస్తే ఎక్కడొ తిరిగినట్లుగా ఎక్కడొ విదేశాల్లో కూర్చున్న గోల్డ్ మాఫియా మన హైదరాబాద్ ను టార్గెట్ చేసింది. దుబాయ్, సింగపూర్, బ్యాంకాంక్ లో కూర్చున్న ఈ గోల్డ్ మాఫియా హైదరాబాద్ కేంద్రంగా తమగోల్డ్ వ్యాపారం చేస్తున్న తీరు ఇది. శంషాబాద్ ఇంటర్మేషనల్ ఎయిర్ పోర్టును తమ అడ్డాగా చేసుకుంటున్నాయి. ముఖ్యంగా దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికుల్లోనే చాల మంది ఈ గోల్డ్ మాఫియాకు వెన్నుదన్నుగా వున్నట్లుగా అధికారులు గుర్తించారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోప్రతి రెండు రోజులకు ఒక్కసారి కిలో ల కొద్దీ బంగారం బయట పడుతునే వుంది. దుబాయ్, మలేషీయా, సింగపూర్, బ్యాంకాంక్ తో పాటుగా అరబ్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో ఈ గోల్డ్ వస్తుంది. విదేశాల్లో తిష్ట వేసిన మాఫియా హైదరబాద్ కు స్వేచ్చగా ఈ బంగారాన్ని పంపిస్తుంది. అరబ్ కంట్రీలో పనిచేసి ఇండియాకు తిరిగి వస్తున్న కూలీలతో పాటుగా టూరిస్టులను టార్గెట్ చేసుకుని వీరు ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. అధికారులకు చిక్కకుండా బంగారం అనుకున్న చోటకు డెలివరీ అయితే లక్షల్లో లాభం వస్తుంది. కొత్త కొత్త పద్ధతుల్లో వీరు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు.
కార్మికుల చేత పంపుతున్న......
ముఖ్యంగా మెడికల్ , ఎలక్ర్టానిక్ వస్తువుల పేరుతో వీరు బంగారాన్ని హైదరాబాద్ కు పంపిస్తున్నారు. తమ వాళ్లు హైదరాబాద్ లో వున్నారు. వారికి అర్జెంట్ మెడిసిన్ ఇవ్వాలని చెప్పి కార్మికులను మాయ మాటలు చెప్పి నమ్మించి పార్శిల్ ను ఇస్తున్నారు. ఈ పార్శిల్ గనుక అధికారులకు చిక్కకుండా అనుకున్న చోటకు డెలివరి అయితే లక్షల్లో ఈ మాఫియా సంపాందిస్తుంది. బంగారం డేలివరి అయిన తరువాత హావాలా ద్వారా మనీ మాఫియాకు చేరుతుంది. ఆది, సోమ వారాల్లో ఎయిర్ పొర్టులో పెద్ద మొత్తంలో కస్టమ్స్ అధికారులు బంగారాన్ని పట్టుకున్నారు. ఇది కూడా ఈ సారి కొత్త పద్దతిలో వచ్చిన బంగారాన్ని సీజ్ చేశారు. చిన్న పాటి పాన్ లోపలి భాగంలో ఇత్తడితో పాటుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక అర లాంటి దానిలో బంగారాన్ని పెట్టారు. ఫ్యాన్ కు వుండే కాపర్ కడ్డీలను పై భాగంలో పెట్టి. లోపలి భాగంలో బంగారం కడ్డీలను పెట్టారు. దీనిపైన కార్బన్ పేపర్స్ ను చుట్టారు. దుబాయ్ నుంచి వస్తున్న ఒక కార్మికుడికి అక్కడి మాఫియా ఈ పార్శిల్ ఇచ్చింది. ఈ చిన్న పాటి పార్సిల్ ను తమ వాళ్లు ఎయిర్ పోర్టులో కలుస్తారు ఇవ్వమని చెప్పింది. దీంతో ఎయిర్ పోర్ట్ లో దిగిన తరువాత కస్టమ్స్ అధికారులు ఇందులో బంగారం ఉందని సదరు కార్మికుడికి చెప్పడంతో అవాక్కయ్యాడు. రెండు కిలో ల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
అసలు మాఫియాపై కన్నేయని అధికారులు.....
అలాగే సొమవారం రోజు కూడా పెద్ద మొత్తంలో బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. ఇది కూడా ఒక సూట్ కేసు ఇనుప కడ్డీల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న పాటి సొరంగంలో ఈ బంగారాన్ని పెట్టి తీసుకుని వస్తున్న ఒక ప్యాసింజర్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఈ ప్యాసింజర్ నుంచి ఈ గొల్డ్ ను పట్టుకున్నారు అధికారులు. రెండు రోజుల వ్యవధిలో దాదాపుగా ఐదు కిలో ల బంగారాన్ని ఎయిర్ పోర్టులో అధికారులు పట్టుకోగలిగారు. విదేశాల్లో కూర్చున్నీ ఈ మాఫియా స్వేచ్చగా బంగారంను హైదరబాద్ కు పంపిస్తున్నారు. అయితే ఈ మాఫియా గ్రాస్ రూట్స్ ను కనుగొనే ప్రయత్నం కూడా ఇప్పటి వరకు అధికారులు చేయడం లేదు.
- Tags
- శంషాబాద్ గోల్ల్