బాబోయ్ ఇన్ని ప్రశ్నలా!
పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు సభలు సమావేశాలు నిర్వహిస్తూ హడావిడి చేసేస్తుంటాడు. ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే ఈయనకి ప్రజలు, పార్టీ గుర్తొస్తుంది. ఇప్పుడు కూడా తమ అభిమాని ఒకడు హత్యకు గుయారైయ్యాడని అతని ఫ్యామిలీని ఓదార్చడానికాని తిరుపతి వెళ్లి అక్కడ దేవుని దర్శనం తోపాటు ఒక సభ నిర్వహించాలని చూస్తున్నాడు. అయితే ఈ సభ రాజకీయాలకు సంబంధించిందా లేక అభిమానులకు ఏమైనా మెస్సేజ్ ఇవ్వడానికి పెడుతున్నాడా అనేది కొన్ని క్షణాల్లో తెలిసిపోతుంది. రాజకీయాలకు సంబంధించి అయితే ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం బిజెపి ప్రభుత్వాన్ని నిలదీస్తాడా.... లేక మోడీ గారిని ప్రశ్నిస్తాడా... అని తెగ ఆలోచించేస్తున్నారు ప్రజలు. లేకపోతె చంద్రబాబు మోడీ ప్రభుత్వాన్ని ఎందుకు హోదా కోసం నిలదియ్యడం లేదని ప్రశ్నిస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్సు. ఇక మరో వైపు అభిమానులకు ఎలాంటి నీతులు చెబుతాడు. ఇలా కొట్టుకోవడం, చంపుకోవడం మీకు తగదు అని చెబుతాడా లేక అభిమానులకు గట్టిగా వార్నింగ్ లాంటివి ఏమన్నా ఇస్తాడా అనేది కూడా కొద్దీ దేపట్లో తేలిపోతుంది. ఏది ఏమైనా పవన్ బహిరంగ సభ కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అనేది వాస్తవం. పవన్ ఎవరి గురించి మాట్లాడుతాడో... ఏమి చెబుతాడో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూడడం మాత్రం నిజం. ఇంకా రాజాకీల కోసమే ఈ సభ నిర్వహిస్తే మాత్రం పవన్ ఇక పొలిటికల్ గా ఆక్టివ్ గా మారినట్లే. ఇక రాజకీయాల్లో బిజీ అయితే ఇప్పటి వరకు ఒప్పుకున్నా సినిమాలను పవన్ ఏం చేస్తాడో అని అందరూ తీవ్రంగా ఆలోచిస్తున్న ప్రశ్న? మరి దీనికి సమాధానం గా పవన్ ఏం మాట్లాడతాడో చూద్దాం.