యాత్రకు వెళ్ళి సత్తా చాటానంటున్న ముద్రగడ
గోడ దుకాలని అనిపిస్తుంది . ఎన్నాళ్ళు నాకీ నిర్బంధం అంటూ నిర్వేదం లో వ్యాఖ్యానించారు మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం . ఆయన ఆ కామెంట్ చేశారో లేదో కానీ వెంటనే హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సమస్యే లేదు గోడ కాదు అడుగు పడనీయబోమని హెచ్చరించిన సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలో ఆదివారం పాదయాత్రకు ఆకస్మికంగా బయల్దేరి కిర్లంపూడి దాటి రాజుపాలెం గ్రామం దాకా వెళ్ళి అక్కడ పోలీసులు బ్రేక్ వేసి అదుపులోనికి తీసుకోవడంతో కధ మళ్ళీ ముద్రగడ ఇంటికే చేరింది . తదనంతరం మీడియా సమావేశం పెట్టిన ముద్రగడ చూశారా నా సత్తా మీ ఇంటిలిజెన్స్ వైఫల్యం అంటూ ఎద్దేవా చేసి వెక్కిరించారు .
సాధారణ సిబ్బంది పై చర్యలు ఎందుకు ..?
తన యాత్ర అడ్డుకోవడానికి నియమించిన పోలీసులు ఏమి చేస్తారని మీ ఇంటిలిజెన్స్ వైఫల్యాన్ని గుర్తించి మీ దగ్గరే వుండే ఆయన్ను తొలగించే దమ్ము ధైర్యం మీకు ఉన్నాయా అంటూ విమర్శల దాడి ప్రారంభించారు ముద్రగడ . తన ఆకస్మిక పాదయాత్ర అంశంలో అమాయకులను బలి చేయొద్దని ఈ వ్యూహానికి కధ స్క్రీన్ ప్లే దర్శకత్వం తనదే అయినందున చర్యలు తనపై చేపట్టాలని సవాల్ విసిరారు ఆయన . ముఖ్యమంత్రి నంద్యాల , కాకినాడలో కులాల వారీగా సమావేశాలు పెట్టుకుని ఓట్లు అడుగుతున్నప్పుడు కాపులు ఇచ్చిన హామీ అమలు చేయమని కోరితే ఆగ్రహం ఎందుకని ప్రశ్నిస్తున్నారు ముద్రగడ
- Tags
- ముద్రగడ