రాజీనామాకు సిద్ధపడ్డ కేంద్రమంత్రి
ఇటీవల వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేందుకు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని సురేష్ ప్రభు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల చోటు చేసుకున్న రెండు రైలు ప్రమాదాలు తనను తీవ్రంగా బాధించాయని, దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనుకుంటున్నానని ట్వీట్ చేశారు. అయితే సురేష్ ప్రభు కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్రమోడీని కలిసి కూడా తన అభిప్రాయాన్ని సురేష్ ప్రభు తెలిపారు. కాని ప్రధాని నరేంద్రమోడీ వద్దని వారించినట్లు సమచారం. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని ప్రధాని సూచించారని సురేష్ ప్రభు వెల్లడించారు. ఒకే వారంలో రెండు రైలు ప్రమాదాలపై ఆయన మనస్తాపం చెందారు.ఇటీవల ఉత్కళ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి 23 మంది దుర్మరణంపాలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సురేష్ ప్రభు రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే ప్రధాని ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.