వామ్మో...సెక్స్ ర్యాకెట్ వెనక ఈ లేడీ డాన్ ఉందా?
మసాజ్ తో పాటుగా సెక్స్ బిజినెస్. దీనికి అడిషన్ గా డ్రగ్స్ వ్యాపారం. ఇప్పడు స్పా వెనుక నడుస్తున్న దందా ఇది. స్పా రాకెట్ వెనుక థాయిలాండ్ కు చెందని లేడీ డాన్ వర్క్ చేసింది. హైదరబాద్ రాకెట్ వెనక సిద్దార్థ అనే స్పా యాజమని వున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. మసాజ్ సెంటర్లు పేరుతో ఇప్పడు కొత్త కొత్త దందా కొనసాగుతుంది. ఈ కొత్త తరహా వ్యాపారం చూసి పోలీసులే విస్తు పోతున్నారు. ఏకంగా ఒక దేశం నుంచి అమ్మాయిలను తీసుకుని వచ్చి వ్యభిచారం నిర్వహిస్తుంది ఈ ముఠా. ఈ ముఠా ఉచ్చులో కూరుకుని పోయిన థాయిలాండ్ అమ్మాయిలు విలవిలాడిపొతున్న తీరు ఇది. దీనికి తోడుగా మన దేశంలోని ఈశాన్య రాష్ట్రంల్లోని అమ్మాయిలను కూడా వీరు బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న వైనమిది.. డ్రగ్స్ తో పాటు వ్యభిచారం చేయిస్తున్న ఈ ముఠా ఆగడాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠాలోని ప్రధాన సూత్రదారి అరెస్టు రిమాండ్ డైరీలో పలు విషయాలు వెలుగు లోకి వచ్చాయి.
ఎంతమంది అమ్మాయిలో......
ఈ ముఠా నాయకుడు చేస్తున్న అరాచకాలు చూస్తుంటే ఈ విధంగా కూడా చేయవచ్చా అని ముక్కున వేలేసుకుంటున్నారు. అర్థరాత్రి సమయంలో మూడు ప్రాంతంలో సైబరాబాద్ ఎస్ వొటి టీమ్ లు దాడులు చేశాయి. మాదాపూర్, గచ్చిబౌలి. రాయదుర్గం ఏరియాలో 12 స్పా ల పైన పోలీసులు దాడులు చేశారు.. ఇందులో 64 మంది మహిళలను పోలీసులు రెస్క్యూ చేశారు. రెస్క్యూ అయిన మహిళల్లో థాయిలాండ్ కు చెందిన మహిళలే ఎక్కువ మంది వున్నారు. 34 మంది థాయిలాండ్ కు చెందిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోంకు తరలించారు. దీంతో పాటుగా 24 మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మహిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో మహిళ ఎలా స్పా లకు వస్తున్నారన్న దానిపైన పోలీసులు విచారణ చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎంసీఏ చదివి.... సెక్స్ వ్యాపారంలోకి....
ఈ అమ్మాయిల సరఫరా వెనుకాల ఒక మాఫియానే నడుస్తుందని పోలీసులు గుర్తించారు. ఈ మాఫియా ముంబై నుంచి నడుస్తుందని బయట పడింది. ఈ మాఫియాను ఒక లేడీ డాన్ నడిపిస్తుంది. థాయిలాండ్ కు చెందిన లేడీ కేక ఈ మాఫియా డాన్ అని తెలింది. ఇప్పడు ఈ మాఫియా డాన్ ను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఇక పొతే హైదరాబాద్ లో మరో లేడి డాన్ ఒకరు పనిచేస్తున్నారు. మాదాపూర్, గచ్చి బౌలీ, బంజారాహిల్స్ లో ఆరు థాయి మసాజ్ సెంటర్లు అయిన స్పాలను ఏర్పాటు చేసి నడుపుతున్న దాసరి సిద్దార్ద్ గా అధికారులు గుర్తించారు. ఈ సిద్దార్ద్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మొత్తం ఆరు స్పాల తో పాటుగా హైదరబాద్ నగరంలో ఏ థాయ్ అమ్మాయి రావాలన్నా సిద్దార్థ్ మాత్రమే తీసుకుని వస్తుంటారు. ముంబైలో వున్న థాయి లేడీ కెక సహాయంతో అమ్మాయిలను ఇక్కడికి తీసుకున వచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. ఇక పొతే ఎంసిఎ పూర్తి చేసి సిద్దార్ద్. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యొగి కూమారుడు. థాయి లాండ్ లో ఎంజాయి చేయడానికి వెళ్లి అక్కడి అమ్మాయిలు చేస్తున్ మసాజ్ తో మన వాడు ఫిదా అయిపోయాడు. దీంతో కొన్ని రొజుల పాటు అక్కడ థాయి మసాజ్ లో శిక్షణ తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తరువాత బంజారాహిల్స్ లో తంత్ర స్పాను ఏర్పాటు చేశారు. థాయి మసాజ్ కు తమ స్పా పెట్టింది పేరు అంటూ ప్రచారం చేశాడు.
ఈశాన్య రాష్ట్రాల మహిళలు కూడా....
అయితే థాయిలాండ్ నుంచి అమ్మాయిలను తీసుకుని రాలేదు.. కాని ఈశాన్య రాష్ట్రాల్లో వుంటే మహిళలను ముందుగా హైదరాబాద్ కు తీసుకుని వచ్చాడు. వారి చేత మసాజ్ చేయించడం మొదలు పెట్టాడు. అయితే వ్యాపారం లాభసాటిగా లేక పొవడంతో థాయి అమ్మాయిలను రంగంలోకి దించాలని అనుకున్నాడు. దీంతో తనకు తెలిసిన వారితో ముంబైకి థాయి అమ్మాయిల ఎగమతి దిగుమతులను చేసే థాయి లేడి కేక తో పరిచయం చేసుకున్నాడు.. కమీషన్ పద్ధతిలో అయితే థాయి అమ్మాయిలను పంపిస్తానని చెప్పింది కేక. దీంతో థాయిలాండ్ అమ్మాయిలను విజిట్ వీసా మీద ముంబైకి రప్పించేది కేక. అక్కడికి వచ్చిన తరువాత సిద్దార్ద్ ను కాంటాక్ట్ చేసి ఎంత మంది అమ్మాయిల అవసరం వుంటే వెంటనే వారిని హైదరబాద్ కు పంపించేది. ఇలా థాయి అమ్మాయిలను తీసుకుని వచ్చి వ్యాపారం చేయడంతో బిజినెస్ బాగా లాభసాటిగా మారింది. దీంతో తన వద్దనే పర్మినెంట్ గా 30 మంది అమ్మాయిలు వుండే విధంగా సిద్ధార్థ్ ప్లాన్ చేశాడు. థాయ్ అమ్మాయిల రాకతో సిద్దార్ద్ వ్యాపారం పెరిగిపొయింది. ఒక్క స్పా కాస్తా ఆరు స్పాలు అయ్యాయి. మసాజ్ సెంటర్లు కాస్తా సెక్స్ సెంటర్లు గా మారిపోయాయి. మసాజ్ చేసుకొవడానికి వచ్చిన యువకులకు థాయి అమ్మాయిలతో వల వేయించి వ్యభిచారం చేయించే వాడు సిద్దార్ద. ఇక్కడ వరకు బాగానే వుంది. తనకు తెలిసిన సెక్స్ వ్యాపారం తో పాటుగా డ్రగ్స్ దందాలోకి కూడా దిగాడు సిద్దార్ద. ఏకంగా సినిమా రంగానికి చెందిన బుల్లి తెర నటులను తన బుట్టలో వెసుకున్నాడు. థాయ్ అమ్మాయిలతో పాటుగా డ్రగ్స్ వ్యాపారం చేసే వాడు సిద్దార్ద. ఇలా ఒక సినిమా హీరోయిన్ తో పాటుగా ఇటీవల బాగాపాపులర్ అయిన ఒక షో కు చెందిన నటీ నటులు కూడా సిద్ధార్థ వలలో పడ్డారు. వీరికి డ్రగ్స్ అలవాటు చేసింది ఈ సిద్దార్దనే .. మసాజ్ కొరకు స్పా వచ్చిన వారికి డ్రగ్స్ ఇచ్చేవాడు సిద్దార్ద.
వేలల్లో జీతం.....
ఇక పొతే థాయి లాండ్ అమ్మాయిలను అడ్డం పెట్టుకుని పెద్ద మొత్తంలో హైటెక్ సిటి, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ఏరియాలో సెక్స్ వ్యాపారం చేశాడు. సిద్దార్ద. అయితే థాయి లాండ్ అమ్మయి నెల వారి జీతాలు ఇచ్చే వారు. అందంగా ఉన్న అమ్మాయిలకు యాభై వేలరూపాయలు ఇచ్చేవాడు..కనీసం 25 వేల నుంచి 50 వేల వరకు థాయి అమ్మాయిలను జీతం క్రింద ఇచ్చి వ్యభిచారం చేయించాడని పోలీసుల విచారణ తేలింది.విజిట్ వీసా కింద వచ్చిన ఈ అమ్మాయిలు చేస్తున్న అక్రమ దందా పైన పోలీసులు , ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు. విజిట్ విసా మీద వచ్చిన యువతులను తిరిగి సొంత దేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.