వారిద్దరూ ఒకటయి పోయారు
అన్నాడీఎంకేలో రెండు వర్గాలూ విలీనమయ్యాయి. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు కలిసిపోయాయి. అమ్మ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని, అమ్మ ఆత్మ కోరిక మేరకు విలీనం జరిగిందని పన్నీర్ సెల్వం ప్రకటించారు. కాగా పన్నీర్ సెల్వం పది డిమాండ్లకు పళనిస్వామి అంగీకరించారు. పన్నీర్ సెల్వానికి ఉప ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు పళనిస్వామి ఓకే చెప్పారు. ఈరోజు సాయంత్రం 5గంటలకు పన్నీర్ సెల్వం ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పన్నీర్ సెల్వంతో పాటు మరో ముగ్గురు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జయలలిత ఆశయాలకుఅనుగుణంగా పనిచేస్తామని ఇద్దరూ ఒకే వేదికపై ప్రకటించడం విశేషం. శశికళను పార్టీ నుంచి బయటకు పంపేందుకు కూడా పళనిస్వామి ఓకే చెప్పేశారు. గవర్నర్ మరికాసేపట్లో కొత్త ముఖ్యమంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మన్నార్ గుడి మాఫియాను బయటకు పంపాలని ఇద్దరూ నిర్ణయించారు.