విశ్లేషకులకు కొత్త పాఠాలు నేర్పిన నంద్యాల ఎన్నికలు
ఎక్కువ పోలింగ్ జరిగితే అధికారంలో వున్న పార్టీకి మైనస్ అన్నది ఎన్నికల్లో విశ్లేషకులు తరచూ చెప్పే మాట . అలాగే ఎన్నికల ఫలితాలు వుంటూ వచ్చాయి . దాంతో ప్రజల్లో ఈ అపోహ బాగా ప్రాచుర్యంలోకి వెళ్ళింది . ఈ సంప్రదాయాన్ని తిరగరాసారు నంద్యాల ఓటర్లు . మొత్తం మూడు మండలాల్లో దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఓటింగ్ లో తీర్పు అధికారపక్షానికి అనుకూలంగా వచ్చి కొత్త చరిత్ర రాసింది .79 శాతం ఓటింగ్ లో అధికారపక్షం సాలిడ్ మెజారిటీ తో ఆధిక్యతను చాటింది . దీనికి ఎన్నికల విశ్లేషకులు ఎన్ని వాదనలు తీసుకువచ్చినా , సర్వేలు ఇచ్చిన ఫలితాలు తలక్రిందులై వారు ఏ భాష్యం చెప్పినా వాస్తవాలు వాస్తవాలే .
ఒకే తీరులో నంద్యాల ఓటర్లు ....
మొత్తం అన్ని రౌండ్లలో ఒకే ఒక్క రౌండ్ తప్ప టిడిపి కి వార్ వన్ సైడ్ చేశారు ఓటర్లు . దీనిని బట్టి వారు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు భావించవచ్చు . ప్రచారంలో వైసిపి దూకుడుగా సాగడంతో పోరు నువ్వా నేనా అన్నట్లు కనిపించినా నంద్యాల ఓటరు తాము ఎవరికి ఓటు వేయాలో ఆలోచించే సైకిల్ ఎక్కారు అన్నది స్పష్టం .మరో రెండేళ్ల తరువాత తిరుగుతుందో లేదో తెలియని ఫ్యాన్ కన్నా అభివృద్హి పనులు ప్రారంభించిన టిడిపి తో అవి పూర్తి చేయించాలన్నది , భూమా కుటుంబంపై పెల్లు బీకిన సానుభూతి , సైకిల్ ను ప్రత్యర్ధులు అందుకోలేనంత దూరంలో విజయ తీరాలకు చేర్చాయి . ఇక పోల్ మేనేజ్మెంట్ లో కాకలు తీరిన అధికార పార్టీ డబ్బు పంపిణి నుంచి ఓటరును బూత్ వరకు తీసుకువెళ్లి ఓటు వేయించుకోవడం వరకు అంతా పక్కాగా చేసి లక్ష్యాన్ని సునాయాసంగా అందుకోగలిగింది .
- Tags
- నంద్యాల ఎన్నికలు