వెంకయ్య ఈ ఒక్క కోరికా తీరలేదట
సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనకు ఎలాంటి వ్యక్తిగత కోరికలు లేవని., ఒకే ఒక్క కోరిక తీరకుండా రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వెంకయ్య చెప్పారు. అసెంబ్లీలో ఉన్నపుడు ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే తాను వ్యతిరేకించానని., ఎంపీగా ఉన్నపుడు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలంటే ఎంపీలు బెంగళూరులో ఎందుకుండాలి నియోజక వర్గంలో ఉండాలని తాను వాదించినట్లు వెంకయ్య చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాక ఆగష్టు 18న ఇల్లు ఖాళీ చేయాలని భార్యకు ముందే చెప్పానని అప్పటికి ఉపరాష్ట్రపతి ఇల్లు రెడీ కాకున్నా ఔట్ హౌస్లో ఉండి ఇల్లు మారిపోయానని చెప్పారు. అంతకుముందు పదేళ్లు మరొకరు వాడిన ఇల్లు కావడంతో చిన్నచిన్న రిపేర్లు చేయించాల్సి వచ్చిందన్నారు. మంత్రిగా ఉండగా కారుకు ఎర్ర బుగ్గ ఎప్పుడు పెట్టుకోలేదని, తర్వాత అదే అంతా అమలు చేస్తున్నారని వెంకయ్య చెప్పారు.
కోరిక అదే.....
తనకు 70ఏళ్ల వచ్చాక క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని., ఇప్పుడు 68ఏళ్లని 2019 ఎన్నికల్లో మోదీ గెలిచాక రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలి అనుకున్నానని వెంకయ్య చెప్పారు. మోదీకి ఇదే విషయం చెబితే అందుకు ఇంకా సమయం ఉంది కదా అన్నారని రాజ్యసభ పదవికి 2022 వరకు సభ్యత్వం ఉందన్నారు. మరోసారి మోదీ ప్రధాని అయ్యాక 2020 జనవరి 12నాటికి రాజీనామా చేయాలని భావించానని వెంకయ్య చెప్పారు. 2019 ఎన్నికలు ముగిశాక 2020లో సొంత ఊరు వెళ్లాలనే కోరిక తీరలేదని ఇదంతా విధి లిఖితం అన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎన్డీఏతో పాటు చాలా పార్టీలు మద్దతిచ్చాయని వారి నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. రాజకీయాల్లో తెలుగు వారికి సహాయపడేందుకు కృషి చేశానని తన శక్తిమేరకు ఏపీకి కూడా భవిష్యత్తులో సాయం చేస్తుంటానన్నారు. ఇకపై రాజకీయం చేయను కాని అభివృద్ధి విషయంలో సహకరిస్తానని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరచూ కలిసి మాట్లాడుకోండి. సమస్యలు మాట్లాడుకోండి., సమస్యలు ఎప్పుడు ఉంటాయని వాటిని చర్చించి పరిష్కరించుకోండి., ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు వెళ్లాలని చెప్పారు. కేసీఆర్-చంద్రబాబు అందుకు సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు.
- Tags
- వెంకయ్యనాయుడు