శిల్పా బ్రదర్స్ ఓవర్ కాన్పిడెన్సే ముంచిందా?
శిల్పా బ్రదర్స్ అతి విశ్వాసమే వారిని పరాజయం పాలు చేసింది. దాదాపు నెల రోజుల పాటు మలేరియా జ్వరంతో బాధపడిన శిల్పా మోహన్ రెడ్డి తన ఓటమికి అదే కారణమని, డబ్బు పంపిణీ, అధికార దుర్వినియోగమని చెబుతున్నప్పటికీ ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసిందని, గాల్లో లెక్కలు వేసుకుని మరీ బరిలోకి దిగారని వైసీపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. అయితే తాను రాజకీయంగా దెబ్బతినడమే కాకుండా సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి పొలిటికల్ ప్యూచర్ ను కూడా ఫణంగా పెట్టారు. దాదాపు రెండు దశాబ్దాల కాలపు రాజకీయ జీవితాన్ని అనుభవించారు శిల్పా సోదరులు. తప్పటడుగులు, రాంగ్ డెసిషన్స్ కారణంగానే నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పా కుటుంబానికి చావుదెబ్బ తగిలిందన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.
పదవి త్యాగం చేసినా.....
2014 ఎన్నికల ఫలితాలను లెక్కవేశారు శిల్పా. ఆ ఎన్నికల్లో తాను టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 3600 ఓట్ల తేడాతో అప్పటి వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డిపై ఓటమి చెందారు. అయితే అప్పుడు వైసీీపీకి బలంగా గాలి వీచింది. వైసీపీకి వేవ్ ఉన్నప్పుడే తాను స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యానని, అది కూడా తన సొంత బలంతోనే అన్ని ఓట్లు వచ్చాయని శిల్పా నమ్మారు. అందుకే అధికారంలో ఉన్న టీడీపీని వదిలేయడానికి ఆయన వెనకాడలేదు. ఎలాగైనా నంద్యాల ఎమ్మెల్యే కావాలన్నది ఆయన ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే అధికార పార్టీని విడచి ప్రతిపక్ష వైసీపీలో చేరి టిక్కెట్ తెచ్చుకున్నారు. జగన్ చరిష్మా, తన సొంత బలం, ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి తనను గట్టెక్కిస్తుందనుకున్నారు. అందుకోసం తన సొంత సోదరుడు టీడీపీలో ఉన్నా ఆయన ఇంటికి వెళ్లి బలవంత పెట్టారు. వాస్తవానికి శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ గా గెలిచి మూడు నెలలే అయింది. ఆయనకు ఆరు నెలల పదవీ కాలం ఉంది. అయినా సోదరుడి ఆహ్మానాన్ని కాదన లేక పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అన్న గెలిస్తే చాలన్న నమ్మకంతో చక్రపాణి రెడ్డి ఆరేళ్ల పదవి ఉన్న ఎమ్మెల్సీని త్యాగం చేశారు. ఇది కూడా తమకు కలిసివస్తుందనుకున్నారు. విలువల కోసం కట్టుబడి ఉన్నామన్న సంకేతాలను పంపినా ప్రజలు పెద్దగా విశ్వసించలేదు. దీంతో శిల్పా బ్రదర్స్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారింది. నంద్యాలలో రెండోసారి కూడా శిల్పా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. మళ్లీ రెండేళ్ల వరకూ శిల్పా బ్రదర్స్ అధికారం కోసం వెయిట్ చేయాల్సిందే.
- Tags
- శిల్పా బ్రదర్స్