Mon Dec 23 2024 17:31:39 GMT+0000 (Coordinated Universal Time)
ఒప్పో రెనో 8 5G, రెనో 8 Pro 5G ధరలు లీక్..!
Oppo జూలై 18న జరిగే ఈవెంట్లో అధికారిక ధర వివరాలను ప్రకటించనుంది. రెండు డివైజ్‌లు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో
Oppo Reno 8 సిరీస్ మొబైల్ ధరల వివరాలు లీక్ అయ్యాయి. Oppo జూలై 18న భారతదేశంలో కొత్త రెనో 8 సిరీస్‌ను విడుదల చేయనుంది. కంపెనీ రెనో 8 సిరీస్‌లో భాగంగా రెనో 8, రెనో 8 ప్రో 5G అనే రెండు ప్రీమియం స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. అధికారిక లాంచ్‌కు ముందు, భారతదేశంలో Oppo Reno 8 Pro, Reno 8 5G మొబైల్ ధరలకు సంబంధించిన వివరాలు లీక్ చేయబడ్డాయి. Oppo Reno 8 ధర రూ. 29,999 నుండి ప్రారంభమవుతుంది. Oppo Reno 8 5G 8GB + 256GB ధర రూ. 31,999 ఉండబోతుండగా.. 12GB + 256GB వేరియంట్ ధర రూ. 33,990 ఉండనుంది. Oppo Reno 8 Pro 5G.. 12GB RAM, 256GB అంతర్గత నిల్వతో వస్తుంది. రెనో 8 ప్రో 5G ధర రూ. 44,990 ఉండవచ్చని లీకుల ద్వారా తెలుస్తోంది.
Oppo జూలై 18న జరిగే ఈవెంట్లో అధికారిక ధర వివరాలను ప్రకటించనుంది. రెండు డివైజ్‌లు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500 mAh బ్యాటరీతో వస్తాయని కంపెనీ ధృవీకరించింది. Reno 8 5Gలో MediaTek డైమెన్సిటీ 1300 SoC ఉంటుంది, Reno 8 Pro 5G డైమెన్సిటీ 8100-MAX SoCని కలిగి ఉంది. రెనో 8 ప్రో 5G వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. రెనో 8 5G లో 50MP సోనీ IMX766 ప్రధాన కెమెరా, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. ఇందులో అల్ట్రావైడ్ సెన్సార్ ఉండదు. బదులుగా రెనో 8 5G 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం, రెండు ఫోన్లు 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటాయి. రెనో 8 5G 6.43-అంగుళాల 90Hz AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది, రెనో 8 ప్రో 5G 6.7-అంగుళాల 120Hz AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది.
Next Story