Tue Nov 12 2024 19:45:51 GMT+0000 (Coordinated Universal Time)
Uagdi : క్రోధి నామ సంవత్సరం అంటే ఏంటి?
ఈసారి ఉగాది వచ్చే ఏడాదిని క్రోధి నామ సంవత్సరంగా పిలవనున్నారు. కోపాన్ని కలిగించేది అని అర్థం
ఈసారి ఉగాది వచ్చే ఏడాదిని క్రోధి నామ సంవత్సరంగా పిలవనున్నారు. కోపాన్ని కలిగించేది అని అర్థం. ప్రతి ఉగాది నాడు పంచాగ శ్రవణం జరుగుతుంది. వివిధ రాశుల వారికి ఈ ఏడాది ఫలితాలు ఎలా ఉండబోతాయో అందులో చెబుతారు. ప్రత్యేకంగా ఉగాది నాడు పంచాగాన్ని పండితులు విడుదల చేస్తారు. గ్రహాలు, నక్షత్రాలను బట్టి వీటిని తయారు చేసి ఎవరి నక్షత్రంలో ఎలా ఉండబోతుందో చెబుతారు. అనేక రాశుల వారికి ఈ సందర్భంగా రానున్న ఏడాదిలో శుభంతో పాటు కష్టాలను కూడా వివరిస్తారు.
ఆదాయ వ్యయాలతో పాటు...
ఆదాయ వ్యయాలను కూడా పంచాంగంలో పొందుపరుస్తారు. కొత్త ఏడాది క్రోధి నామ సంవత్సరంలో శుభముహూర్తాలతో పాటు మూఢమి, చెడు రోజులు వంటివి కూడా చెబుతారు. దీని ప్రకారం హిందు ప్రజలు నడుచుకోవాల్సి ఉంటుందని పండితులు సూచిస్తారు. ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది... తిరిగి ఎప్పుడు మంచి ముహూర్తాలు ముగిసిపోతాయన్నది కూడా పంచాగంంలో సవివరంగా చెబుతారు పండితులు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం అన్ని రాజకీయ పార్టీలలో పంచాంగ శ్రవణాలు పండితులతో నిర్వహిస్తారు.
పంచాగ శ్రవణం...
క్రోధి నామ సంవత్సరంలో ప్రజలు కోపంతో ఉంటారంటారు. యుద్ధాలు జరిగే అవకాశముందని చెబుతున్నారు. రాష్ట్రాల మధ్య కూడా సఖ్యత తక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు. ఆవేశంతో వ్యవహరించే ముందు కొంత ఆలోచన చేయడం మంచిదని కూడా పండితులు ఈ సందర్భంగా చెప్పనున్నారు. పచ్చడి తోనే దినచర్యను ప్రారంభించేలా ప్రతి కుటుంబంలో సభ్యులు ఈ ఉగాది పండగను జరుపుకుంటారు. ఉగాది రోజున సంతోషంగా ఉంటే ఏడాది మొత్తం సంతోషంగానే ఉంటుందని పండితులు చెబుతున్నారు.
Next Story