Ugadi : విశ్వాసునామ సంవత్సరం ఎలా ఉంటుందంటే?
నేడు ఉగాది పండగ. దేశమంతా భారతీయులు ఉగాది పండగను జరుపుకుంటారు

నేడు ఉగాది పండగ. దేశమంతా భారతీయులు ఉగాది పండగను జరుపుకుంటారు. ఈసారి ఉగాది వచ్చే ఏడాదిని శ్రీ విశ్వావసు నామ సంవత్సరం గా పిలుస్తున్నారు. ఉగాది పండగ అంటే ప్రజలకు తొలి పండగ లాంటిది. ఇప్పటి నుంచి ఇక పండగలు ప్రారంభమవుతాయి. అందుకే యుగానికి సంబంధించి ఆది అని అంటారు. అందుకే ఉగాదిగా ప్రతీతి. ప్రతి ఉగాది నాడు పంచాగ శ్రవణం జరగడం సంప్రదాయంగా వస్తుంది. వివిధ రాశుల వారికి ఈ ఏడాది ఫలితాలు ఎలా ఉండబోతాయో అందులో చెబుతారు. ప్రత్యేకంగా ఉగాది నాడు పంచాగాన్ని పండితులు విడుదల చేయడంతో వారి అదృష్టాలు తెలుసుకునే వీలుంది. గ్రహాలు, నక్షత్రాలను బట్టి వీటిని తయారు చేసి ఎవరి నక్షత్రంలో ఎలా ఉండబోతుందో చెబుతుండటంతో అందుకు తగిన నష్ట పరిహారకాలు ఏవైనా ఉంటే వాటిని తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అనేక రాశుల వారికి ఈ సందర్భంగా ఈ ఏడాదిలో జరిగే అదృష్టాలతో పాటు కలిగే నష్టాలను కూడా వివరించనున్నారు.