Mon Dec 23 2024 06:43:48 GMT+0000 (Coordinated Universal Time)
UGADI 2023 : ఉగాదిని ఎలా జరుపుకోవాలి ? పంచాగ శ్రవణం ఎందుకు ?
హిందువులు సాంప్రదాయం ప్రకారం జరుపుకునే పండుగల్లో తొలి పండుగ ఉగాది. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి, తలకు నువ్వుల..
యుగానికి ఆరంభం ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే పండుగే ఉగాది. ఈ రోజు నుంచే ప్రకృతిలోనూ మార్పులు జరుగుతాయి. శిశిరఋతువు ముగిసి, వసంత ఋతువు మొదలయ్యేది ఈ రోజు నుంచే. అలాంటి ఉగాదిని ఎలా జరుపుకోవాలి ? ఆ రోజున దేవుడిని ఎలా పూజించాలి ? ఇప్పుడు తెలుసుకుందాం.
హిందువులు సాంప్రదాయం ప్రకారం జరుపుకునే పండుగల్లో తొలి పండుగ ఉగాది. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి, తలకు నువ్వుల నూనె పట్టించాలి. నలుగుపిండితో స్నానమాచరించి కొత్త బట్టలు కట్టుకోవాలి. పాలు పొంగించి, పిండి వంటలు సిద్ధం చేసి.. ఇష్టదైవాన్ని పూజించాలి. తయారు చేసుకున్న వంటకాలను దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. వీటన్నింటికంటే.. ఉగాది పచ్చడి ముఖ్యమైనది. షడ్రులచులతో తయారయ్యే ఈ పచ్చడిని.. మన జీవితంలో వచ్చే కష్టసుఖాలు, ఆటుపోటులకు సూచకంగా చెబుతారు పెద్దలు. నైవేద్యం అనంతరం అల్పాహారానికంటే ముందే ఉగాది పచ్చడిని స్వీకరించాలి.
ఉగాది రోజంతా ఆలయాల్లో పంచాంగ శ్రవణం ఉంటుంది. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. రాశులు, గ్రహస్థితులు, ఏయే రాశుల వారికి ఆదాయ, వ్యయాలతో పాటు, రాజయోగం, అవమానాలు ఎలా ఉన్నాయో ఈ పంచాంగ శ్రవణంలో చెబుతారు. పంచాంగ శ్రవణం అనేది ఒక నమ్మకం. జాతకాలు, గ్రహాలు, నక్షత్రాలున్నాయని నమ్మేవారంతా.. ఈ పంచాంగ శ్రవణాన్ని విశ్వసిస్తారు.
Next Story