Mon Dec 23 2024 16:00:34 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : యుద్ధంతో ఈ వస్తువులు మరింత ప్రియం
మార్కెట్ నిపుణుల అభిప్రాయం మేరకు యుద్ధంతో నూనెలు, గోధుమలు, సెల్ ఫోన్ల ధరలు భారీగానే పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ప్రపంచ దేశాలన్నింటీకి ఈ యుద్ధం ఎఫెక్ట్ పడనుంది. ముఖ్యంగా ఈ యుద్ధం కారణంగా భారత్ లో అనేక వస్తువులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం మేరకు నూనెలు, గోధుమలు, సెల్ ఫోన్ల ధరలు భారీగానే పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఈ ఉత్పత్తులను ఎక్కువగా ఉక్రెయిన్ , రష్యాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటుండటం ఒక కారణం.
సన్ ఫ్లవర్ ఆయిల్....
ప్రధానంగా సన్ ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్, రష్యాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఉక్రెయిన్ నుంచి 70 శాతం, రష్యా నుంచి ఇరవై శాతం దిగుమతి చేసుకుంటూ వస్తుంది. యుద్ధం మరికొద్ది రోజుల పాటు జరిగితే నూనె ధరలు భారత్ లో విపరీతంగా పెరిగే అవకాశముంది. గత ఏడాది భారత్ 1.89 మిలియన్ టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంది.
మొబైల్ ఫోన్లు....
అలాగే గోధుమల దిగుమతిని కూడా భారత్ ఉక్రెయిన్, రష్యాల నుంచే ఎక్కువగా చేసుకుంటుంది. గోధుమల వినియోగం భారత్ లో ఎక్కువగా ఉండటం, ఈ యుద్ధం వాతావరణంతో దిగుమతులు కష్టమే. అందుకే గోధుమల ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. దీంతో పాటు మొబైల్ ఫోన్ల ధరలు కూడా పెరిగే అవకాశముంది. మొబైల్ ఫోన్లలో వినియోగించే పల్లాడియం లోహం రష్యా నుంచే వస్తుంది. పల్లాడియం ధరలు కూడా పెరిగి మొబైల్ ఫోన్ల ధరలు మరింత ప్రియంకానున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Next Story