Mon Dec 23 2024 16:14:25 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine Crisis : జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
Vijayawada : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహిస్తున్నారు.
Vijayawada : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆయన ఈ సమీక్షను నిర్వహిస్తున్నారు. దాదాపు నాలుగువేల మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. మెడిసిన్ చదువుకునేందుకు ఏపీ నుంచి వెళ్లిన విద్యార్థుల జాబితాను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించింది.
వర్సిటీ అధికారులతో....
వారితో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. బంకర్లలో కొందరు తలదాచుకున్నారు. వారికి కావాల్సిన ఆహారం, మంచినీరు వంటి సదుపాయాలను కల్పించేందుకు విదేశాంగ శాఖతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. జపోర్జియా యూనివర్సిటీలో పెద్ద సంఖ్యలో తెలుగు విద్యార్థులు చదువుకుంటుండటంతో వర్సిటీ అధికారులతోనూ టచ్ లో ఉండాలని జగన్ ఆదేశించారు.
Next Story