ఉక్రెయిన్ సూపర్ మార్కెట్‌పై రష్యా ఎటాక్..49 మంది మృతి
ఏళ్లతరబడి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. కొంతకాలం భీకరంగా సాగిన యుద్ధంలో ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు ..
ఏళ్లతరబడి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. కొంతకాలం భీకరంగా సాగిన యుద్ధంలో ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు నేలమట్టమయ్యాయి. వాటిని ఎదుర్కొంటూనే సాధారణ జీవనం ప్రారంభించిన ఉక్రెయిన్ బుధవారం దాడితో మళ్లీ ఉలిక్కిపడింది. రష్యా చేసిన మిస్సైళ్ల ఎటాక్‌తో సూపర్ మార్కెట్ ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. తలలు తెగి, చేతులు, కాళ్లు లేకుండా పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్‌పై మిస్సైళ్లతో రష్యా సేనలు విరుచుకుపడుతున్నారు. ఈ దాడితో 49మంది మృతి చెందగా, మరి కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి 56 మందిని ఉక్రెయిన్ సైనికులు కాపాడారు. మిసైల్ ఎటాక్ జరిగిన ప్రాంతంలో భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే రష్యా చేసిన దాడిని ఉక్రెయన్ తీవ్రరంగా ఖండించింది. ఈ అంశాన్ని ఉక్రెయన్ అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామమని చెబుతున్నారు ఉక్రెయిన్ సేనలు.