Mon Dec 23 2024 15:23:21 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఢిల్లీకి చేరుకోనున్న ఏపీ విద్యార్థులు
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను వెనక్కు రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి
విజయవాడ : ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను వెనక్కు రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం చొరవతో 13 మంది విద్యార్థులు నేడు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు వారు ఢిల్లీ విమానాశ్రయం చేరుకుంటారని తెలిారు. ఢిల్లీకి చేరుకోనున్న ప్రత్యేక విమానంలో 13 మంది ఏపీ విద్యార్థులున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రానున్న విద్యార్థులు వీరే.....
ఇందులో బసంత్ కార్తీక్, గోపకుమార్ నాయర్, వర్ష, గంగరాజు, నాగశ్రీకరి, తూతుకూరి హర్షిత, ఖాన్ టాన్జీ, రాజులపాటి అనూష, పద్మజ రేష్మ, మీనా అవంతిక, ప్రతాప్ తరాని, పెరువన్ కుజిల్ తాన్సిహ సుల్తానా, నీలా హర్షవర్ధన్, దేవ వేదాంత్ మనోజ్ కుమార్, కల్దనే సాక్విబ్ జకీర్ హుస్సేన్ లు ఉన్నారని భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి రప్పించేందుకు ప్రత్యేకంగా నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీ తెలిపింది.
Next Story