Mon Dec 23 2024 06:07:24 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : బయలు దేరిన మరో రెండు విమానాలు
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయలును దేశానికి తీసుకువచ్చేంుదుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయలును దేశానికి తీసుకువచ్చేంుదుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే ఆరు విమనాల్లో దాదాపు 1316 మంది ప్రయాణికులను ఇప్పటికే భారత్ కు తీసుకు వచ్చారు. తాజాగా రెండు విమానాలు భారతీయులను తీసుకుని ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాల నుంచి బయలుదేరాయి. రెండు విమానాల్లో దాదాపు 434 మంది భారతీయులు స్వదేశానికి చేరుకోనున్నారు.
ఆపరేషన్ గంగాలో...
ఆపరేషన్ గంగాలో భాగంగా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను త్వరితగతిన దేశానికి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. దీంతో ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి భారతీయులను రప్పిస్తున్నారు. తాజాగా బుడాపెస్ట్ నుంచి 216 మందితో ఒక విమానం, బుచారెస్ట్ నుంచి 218 మందితో మరో విమానం కొద్దిసేపటిక్రితం బయలుదేరాయి. ఈరోజు ఢిల్లీకి రెండు విమానాలు చేరుకుంటాయి.
Next Story