Mon Dec 23 2024 06:35:10 GMT+0000 (Coordinated Universal Time)
Ukrain War : భారత్ కు చేరుకున్న ఆరో విమానం
కేంద్ర ప్రభుత్వం ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఐదు విమానాలు భారత్ కు చేరుకున్నాయి. తాజాగా ఆరో విమానం బూడాపెస్ట్ నుంచి భారతీయులతో కొద్దిసేపటి క్రితం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఈ విమానంలో 240 మంది భారతీయులు ఉన్నారు. ఇప్పటి వరకూ ఆరు విమానాల్లో 1,396 మందిని తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
మూడోసారి మోదీ....
ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి భారత్ ఈ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. తాజాగా మోదీ ఆదేశాల మేరకు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు కూడా వెళ్లారు. ఆపరేషన్ గంగా పేరిట ఈ మిషన్ ను చేపట్టింది. తాజాగా మోదీ మరోసారి హైలెవెల్ మీటింగ్ లో పాల్గొన్నారు. గత ఇరవై నాలుగు గంటల్లో మోదీ మూడోసారి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారీతీయుల భద్రత, వారిని తీసుకొచ్చే అంశంపైనే చర్చిస్తున్నారు.
Next Story