Fri Nov 22 2024 14:22:01 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వారిని భారత్ కు తిరిగి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వారిని భారత్ కు తిరిగి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రెండు ప్రత్యేక విమనాలను పంపింది. ఉక్రెయిన్ గగనతలంలోకి ప్రస్తుతం ఏ విమానాలు ప్రవేశించలేని పరిస్థితి. నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. రష్యా సైనికులు అనేక ఎయిర్ పోర్టులను ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల పై దృష్టి పెట్టింది.
సరిహద్దు దేశమైన....
ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు విమానాలను పంపి అక్కడి నుంచి భారతీయులను రప్పించాలని నిర్ణయించింది. ఈరోజు రెండు విమానాలు భారత్ కు చేరుకోన్నాయి. ఉక్రెయిన్ లో దాదాపు 20 వేల మంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరిలో అధికశాతం మంది విద్యార్థులే ఉన్నారు. దీంతో ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన రొమేనియా రాజధాని బూచారెస్ట్ కు రెండు ప్రత్యేక విమానాలను భారత్ పంపింది. బూచారెస్ట్ వరకూ రోడ్డు మార్గం ద్వారా వారిని రప్పించనుంది. రెండు ప్రత్యేక విమానాల్లో ఎంత మంది వస్తున్నారన్నది ఇంకా తెలియరాలేదు.
Next Story