Wed Mar 26 2025 22:19:19 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine Crisis : రాజధాని రష్యా హస్తగతం
మరో 96 గంటల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్ రష్యా చేతుల్లోకి వెళుతుందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు.

మరో 96 గంటల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్ రష్యా చేతుల్లోకి వెళుతుందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. కీవ్ నగరంలోకి ఇప్పటికే రష్యా సేనలు ప్రవేశించాయని చెప్పారు. స్నేక్ ద్వీపాన్ని రష్యా బలగాలు ఇప్పటికే సొంతం చేసుకున్నాయి. చెర్నోబిల్ ప్రాంతం కూడా రష్యా సేనల వశమయింది. అయితే ఈ సందర్బంగా జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నా హత్యకు కుట్ర....
తన హత్యకు రష్యా కుట్ర చేస్తుందని చెప్పారు. తన ఫ్యామిలీని హతమార్చడానికి రష్యా ప్రయత్నిస్తుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపడమే లక్ష్యంగా రష్యా బలగాలు కదులుతున్నాయని ఆయన చెప్పారు. తమ సేనలు చివరి వరకూ పోరాడతాయని జెలెన్ స్కీ పేర్కొన్నారు.
Next Story