Fri Apr 04 2025 15:44:22 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : బంకర్లలోనే భారతీయ విద్యార్థులు
క్రెయిన్ లో యుద్ధం జరుగుతుండటంతో భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతుండటంతో భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రష్యా సైనికులు నగరాలను ఆక్రమించుకునే ప్రయత్నంలో బాంబు దాడులు చేస్తుండటంతో ఉక్రెయిన్ లో వాతావరణం బీభత్సంగా మారింది. దీంతో అక్కడ మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు బంకర్లలో తలదాచుకున్నారు. తిండి తిప్పలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు.
నీళ్లు కూడా లేక...
యుద్ధం జరుగుతుండటంతో వారిని సరిహద్దులకు తరలించేందుకు కూడా భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టలేకపోతుంది. దీంతో విద్యార్థులు బంకర్లలోనే తలదాచుకున్నారు. దాదాపు వంద మంది విద్యార్థులు ఒక బంకర్లో తలదాచుకుని తమను కాపాడాలంటూ వీడియో సందేశాలను పంపుతుండటం కంటతడి పెట్టిస్తుంది.
Next Story