Tue Nov 05 2024 07:53:07 GMT+0000 (Coordinated Universal Time)
యుద్ధం ఆగుతుందా?
వెంటనే ఉక్రెయిన్ పై సైనిక ఆపరేషన్ ను నిలిపేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఉక్రెయిన్ పై రష్యా ఇప్పటికైనా వెనక్కు తగ్గుతుందా? యుద్ధాన్ని విరమిస్తుందా? అంటే సమాధానం లేని ప్రశ్నలేనని చెప్పాలి. ఇప్పటికే అంతర్జాతీయ న్యాయస్థానం రష్యా తలంటింది. వెంటనే ఉక్రెయిన్ పై సైనిక ఆపరేషన్ ను నిలిపేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రష్యా తన బలగాలను వెనక్కు రప్పించాలని కూడా సూచించింది. ఇకపై ఉక్రెయిన్ భూ భాగంలో రష్యా ఎలాంటి దాడులకు దిగకూడదని కూడా హెచ్చరించింది.
అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుతో....
దాదాపు ఇరవై రోజుల నుంచి రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతుంది. దాదాపు ముప్ఫయి లక్షల మంది పౌరులు ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లిపోయారు. దాదాపు పది లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను రష్యా పాటిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం అంతర్జాతీయ తీర్పునకు రష్యా కట్టుబడి ఉండాలని కోరారు. లేకుంటే రష్యా ఇబ్బందులు పడుతుందని ఆయన హెచ్చరించారు.
Next Story