Sat Dec 28 2024 14:16:39 GMT+0000 (Coordinated Universal Time)
రష్యా అధీనంలోకి న్యూక్లియర్ ప్లాంట్
జాపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ రష్యా తన అధీనంలోకి తీసుకుంది. క్షిపణులతో దాడి చేసి మరీ ప్లాంట్ ను అధీనంలోకి తీసుకుంది.
జాపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ రష్యా తన అధీనంలోకి తీసుకుంది. క్షిపణులతో దాడి చేసి మరీ ప్లాంట్ ను అధీనంలోకి తీసుకుంది. ఈ సందర్బంగా ప్లాంట్ వద్ద మంటలు వ్యాపించడంతో కొంత ఆందోళన వ్యక్తమయినా మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే దీని వల్ల న్యూక్లియర్ రేడియేషన్ పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్ సేనలపై ర్యాకెట్లు ఫిరంగులతో విరుచుకుపడుతున్నారు.
ప్రపంచ దేశాలు సహకరించండి....
రష్యా సేనలను తీవ్రంగా ప్రతిఘటించినా ఫలితం లేకుండా పోయింది. ఉక్రెయిన్ కు యూరోపియన్ దేశాలు సహకరించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు. రష్యా మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించిందని వ్యాఖ్యానించారు.రష్యా అమానవీయ దాడులను ఖండించాలని ఆయన కోరారు. పుతిన్ కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రష్యాను కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జెలెన్ స్కీ కోరారు.
Next Story