Tue Nov 05 2024 12:43:23 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : పుతిన్ కు కైపు దిగిందా?
ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. బ్యాంకు ఖాతాలను స్థంభింప చేశాయి. వోడ్కాపై నిషేధం విధించాయి
ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. బ్యాంకు ఖాతాలను స్థంభింప చేశాయి. ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన రష్యన్ ఓడ్కాపై అనేక దేశాలు నిషేధం విధించాయి. దీంతో రష్యన్ ఓడ్కా మార్కెట్ పూర్తిగా స్థంభించిపోయింది. ఫలితంగా బిలయన్ల డాలర్ల నష్టం చేకూరింది. రష్యన్ ఓడ్కా ను అనేక మంది ఇష్టపడతారు. ముఖ్యంగా యూరోపియన్ దేశాలలో ఓడ్కాకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. 126 బిలియన్ డాలర్ల వ్యాపారం ఉంటుందని చెబుతారు.
బిలియనీర్లు బికార్లుగా....
దీంతో రష్యాలోని ఓడ్కా కంపెనీలు దివాలా తీస్తున్నాయంటున్నారు. కేవలం ఓడ్కా తయారీ కంపెనీలే కాదు రష్యాలో అనేక మంది బిలియనీర్లు బికార్లుగా మారారు. రష్యాలో అత్యంత సంపన్నులను ఒలిగార్క్ లు అని అంటారు. రష్యాలో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తర్వాత అనేక మంది బిలియనీర్లుగా ఎదిగారు. పుతిన్ కూడా వీరికి అన్ని రకాలుగా ఊతమిచ్చారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడంతో వీరు దేశీయంగా సంపన్నులయ్యారు.
సంపన్నులందరూ.....
పుతిన్ కు దాదాపు 116 మంది సంపన్నులు అండగా నిలుస్తూ వచ్చారు. అయితే ఉక్రెయిన్ తో యుద్ధంతో వీరంతా బికారులగా మారిపోయారంటున్నారు. బ్యాంకు ఖాతాలను స్థంభింప చేయడంతో వీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు చైనాలో బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. యుద్ధం ఆరంభమయిన తర్వాత వీరికి చెందిన 96 లక్షల కోట్లు ఆవిరయినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరంతా గోధుమలు, పామాయిల్, వోడ్కా వంటి వ్యాపారాల్లో ఉన్నారు.
స్టాక్ ఎక్సేంజ్ కుప్పకూలి....
స్టాక్ ఎక్సేంజ్ కూడా రష్యాలో యుద్ధం దెబ్బకు కుప్ప కూలింది. ధరలు విపరీతంగా పెరిగాయి. వీరంతా బికారులగా మారిపోవడం రష్యా ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం చూపే అవకాశముందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. యుద్దం మరికొంత కాలం కొనసాగితే ఉక్రెయిన్ పై పై చేయి సాధించవచ్చేమో కాని, రష్యా సంపన్నులు చేయి చాచాల్సిన పరిస్థితి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే రష్యాలో ఉక్రెయిన్ పై యుద్ధం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.
- Tags
- ukraine war
- vodka
Next Story