Mon Dec 23 2024 15:54:11 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine Crisis : ఖర్చు మేం భరిస్తాం.. స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేయండి
ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను రక్షించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను రక్షించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర విదేశాంగ మంత్రికి తాజాగా ట్వీట్ చేశారు. ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని, అందుకు ఖర్చయ్యే మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని కేంద్రమంత్రికి చేసిన ట్వీట్ లో కేటీఆర్ పేర్కొన్నారు. వారిని తమ ప్రాంతానికి సురక్షితంగా తేవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
చిక్కుకున్న విద్యార్థులు.....
కాగా దాదాపు మూడు వేల ఐదు వందల మందికి పైగా తెలంగాణ విద్యార్థులు చిక్కుకుపోయారు. తెలంగాణ విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలను ప్రారంభించింది. ప్రత్యేకంగా ఢిల్లీ, హైదరాబాద్ లో హెల్ప్ లైన్ లను ఏర్పాటు చేసింది. విమానాలను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తే అందుకు అయ్యే ఇంధన, రవాణా ఖర్చును తాము భరిస్తామని కేటీఆర్ కేంద్రమంత్రి జయశంకర్ కు ట్వీట్ చేశారు.
Next Story