Sun Dec 22 2024 15:39:24 GMT+0000 (Coordinated Universal Time)
Ukrain War : ఢిల్లీ చేరుకున్న 11వ విమానం
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు వేగంగా కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం 11 వ విమానం ఢిల్లీకి చేరుకుంది
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు వేగంగా కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం 11 వ విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ విమానంలో 220 మంది భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చారు. ఇప్పటి వరకూ 2,450 మంది భారతీయులను తీసుకు వచ్చారు. 11వ విమానంలో వచ్చిన విద్యార్థులకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్వాగతం పలికారు.
మరో ఎనిమిది వేల మంది.....
బుకారెస్ట్, బుడాపెస్ట్ ల నుంచి భారతీయులను తరలిస్తున్నారు. కేంద్ర మంత్రులు అక్కడే ఉండి తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఎక్కువగా దాడులు జరుగుతున్న కీవ్ పట్టణం నుంచి విద్యార్థులను దాదాపుగా ఖాళీ చేయించారు. ఖర్కీవ్ నగరంలోనే మరికొందరు విద్యార్థులు చిక్కుకుపోయి ఉన్నారు. తాజాగా ఈరోజు ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు విమానాలు బుకారెస్ట్, బుడాపెస్ట్ కు బయలుదేరి వెళ్లాయి. ఉక్రెయిన్ లో మొత్తం ఇరవై వేల మంది భారతీయులు ఉండగా 12 వేల మంది సురక్షితంగా స్వదేశం చేరుకున్నారు. మరో 8వేల మంది అక్కడ చిక్కుకుపోయినట్లు భారత విదేశాంగ అధికారులు చెబుతున్నారు. బుచారెస్ట్, బుడాపెస్ట్, పోలండ్, స్లోవేకియా నుంచి భారతీయుల తరలింపు జరుగుతుంది.
Next Story