Mon Dec 23 2024 12:05:08 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతికి చేరుకున్న విద్యార్థినులు
ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు ఒక్కొక్కరుగా తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు
ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు ఒక్కొక్కరుగా తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. మూడు విమానాల్లో వచ్చిన తెలుగు విద్యార్థుల్లో తిరుపతికి చెందిన వారు కూడా ఉన్నారు. ఢిల్లీ నుంచి నేరుగా ఆ విద్యార్థినులు ముగ్గరు వయా హైదరాబాద్ రేణిగుంటకు చేరుకున్నారు. తిరుపతికి చెందిన పావని, హాసిని, వర్షిణి తిరుపతి విమానాశ్రయానికి చేరుకోగా వారికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు స్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రభుత్వం........
రాష్ట్ర ప్రభుత్వం తరుపున వారికి రేణిగుంట విమానాశ్రయంలో రెవెన్యూ అధికారులు కూడా స్వాగతం పలికారు. ఈ సంద్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ భారత రాయబార కార్యాలయం నుంచి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తమను అన్ని విధాలుగా ఆదుకుని స్వస్థలాలకు చేర్చారని వారు ధన్యవాదాలు తెలిపారు.
Next Story