Tue Nov 05 2024 10:33:46 GMT+0000 (Coordinated Universal Time)
చివరి దశకు ఆపరేషన్ గంగ
ఆపరేషన్ గంగ చివరి దశకు చేరుకుంది. ఉక్రెయిన్ నుంచి భారతీయులను వేగంగా స్వదేశానికి రప్పించారు.
ఆపరేషన్ గంగ చివరి దశకు చేరుకుంది. ఉక్రెయిన్ నుంచి భారతీయులను వేగంగా స్వదేశానికి రప్పించారు. ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతుండటంతో భారతీయులకు సేఫ్ ప్యాసేజీ కల్పించి మరీ తీసుకు వచ్చారు. తాజాగా ఈరోజు మరో రెండు విమానాలు ఉక్రెయిన్ నుంచి భారత్ కు బయలుదేరాయి. ఇప్పటి వరకూ ఉక్రెయిన్ నుంచి 18 వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చినట్లు కేంద్ర విదేశాంగ తెలిపింది.
సేఫ్ ప్యాసేజీని....
ప్రధాని నరేంద్ర మోదీ ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్, అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో మాట్లాడి భారతీయులకు సేఫ్ ప్యాసేజీని కల్పించారు. రష్యా మూడు సార్లు కాల్పుల విరమణను ప్రకటించింది. ప్రధాన నగరాలైన కీవ్, ఖర్కీవ్, సుమీ వంటి నగరాల్లో భారతీయులు ఎక్కువ మంది చిక్కుకుని పోవడంతో అక్కడ కాల్పుల విరమణను కొద్ది గంటల పాటు పాటించేలా రష్యాను ఒప్పించగలిగారు. దీంతో భారతీయుల రాక మరింత సులువుగా మారింది.
Next Story